ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు,
మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
సాక్షి,పాడేరు: ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గుణపాఠం చెప్పి వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సీఎంను చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆపార్టీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో పోరాటాల నడుమ వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిందన్నారు. మళ్లీ ఏపీకి పూర్వ వైభవం వచ్చే దిశగా జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసేందుకు అన్నివర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.


