ముంచంగిపుట్టు: ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా వైఎస్సార్‌సీపీ పార్టీ ఉందని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు.మండల కేంద్రంలో గురువారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.నాలుగు రోడ్ల కూడలిలో వైఎస్ విగ్రహనికి ఆమెతోపాటు పాడేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై జగన్ అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి పధంలో గిరిజన గ్రామాలు దూసుకుపోయాయన్నారు.కూటమి ప్రభుత్వంలో సంక్షేమం గాడితప్పడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో కొంతమంది కూటమి నేతలే మహిళలను లైంగికంగా వేధించడం, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు పద్మారావు, ఎంపీపీ అరిసెల సీతమ్మ, వైస్‌ఎంపీపీ భాగ్యవతి, వైఎస్సార్‌సీపీ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ జగబంధు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండలరావు, సర్పంచ్‌లు నీలకంఠం, గంగాధర్, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, గణపతి, మండల వైఎస్సార్‌సీపీ నేతలు జయదేవ్, రాంప్రసాద్, మూర్తి, సన్యాసిరావు, అర్జున్, గాసిరావు, మత్స్యలింగం, అప్పారావు, దాసు, దేవ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్
జల్లిపల్లి సుభద్ర


