నక్కపల్లి: స్థానిక ఏరియా ఆస్పత్రిని రూ.32.80 కోట్లతో అభివృద్ధి చేసి, 100 పడకల స్థాయికి పెంచి మల్టీస్పెషాలటీ ఆస్పత్రిగా మార్పుచేస్తున్నట్లు హోం మంత్రి వంగల పూడి అనిత తెలిపారు. శనివారం ఆమె క్యాంపు కార్యాలయంలో సమన్వయకమిటీ సభ్యులు,క్లస్టర్,యూనిట్ ఇన్‌చార్జ్‌లతో సమావేశం నిర్వహించారు.అనంతరం విలేకరులతోమాట్లాడుతూ పెద ఉప్పలం–లింగరాజుపాలెం మధ్య వంతెన నిర్మాణానికి రూ.13 కోట్లు, కోటవురట్ల మండలం ఇందేశమ్మ వాక వద్దకొండలను తొలచి రోడ్డు విస్తరణకు రూ.16 కోట్లు మంజూరైనట్టు చెప్పారు. నక్కపల్లి, ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న నక్కపల్లి ఏరియా ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంటరు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పెనుగొల్లు ఆస్పత్రి అభివృద్ధికి రూ.50లక్షలు మంజూరైనట్టు ఆమె చెప్పారు. ఉపాధి అవకాశాల కోసం నక్కపల్లి మండలంలో స్వయం పేరుతో డ్రైఫిష్ యూనిట్ , రాజయ్యపేటలో మత్స్యకారుల కోసం బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈనెల 23న ఆర్సిలర్ మిట్టల్‌స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొప్పిశెట్టి వెంకటేష్,మార్కెట్‌కమిటీ చైర్మన్ దేవర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
హోం మంత్రి అనిత


