ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
పాడేరు: జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలోని పాత బస్టాండ్‌లోని వైఎస్ విగ్రహం వద్ద గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. ఉదయం 9గంటలకు దివంగత నేత వైఎస్ కాంస్య విగ్రహానికి పూలమామలు వేసి ఘన నివాళులు అర్పిస్తామన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి ఆవిర్భా దినోత్సవ కేక్‌ను కట్ చేస్తామన్నారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ మండల అధ్యక్షుడు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అన్ని విభాగాలకు చెందిన పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.


