పెన్షనర్ల జేఏసీ జిల్లా కార్యదర్శిగా గిరి | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్ల జేఏసీ జిల్లా కార్యదర్శిగా గిరి

Mar 12 2026 7:30 AM | Updated on Mar 12 2026 7:30 AM

చింతపల్లి: ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (ఏపీ జేఏసీ) జిల్లా కార్యదర్శిగా యూవీ గిరి బుధవారం ఎంపికయ్యారు. 2002లో విద్యా వలంటర్ల నాయకునిగా ఆయన పనిచేశారు. తరువాత పీఆర్‌టీయూ మండల అధ్యక్షునిగా, జిల్లా అధ్యక్షునిగా,రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు. ఈ సందర్బంగా గిరి మాట్లాడుతూ 12వ ఆర్థిక సంఘం ఏర్పాటు చేసి కొత్త వేతనాలు అమలు చేయాలని, పెన్షనర్లకు రావలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పాత పెన్షన్‌ విధానం కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగ్గించాలని, గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలను పూర్తిగా గిరిజనులకు కేటాయించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement