గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోపాడి పరిశ్రమ కీలకం | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోపాడి పరిశ్రమ కీలకం

Mar 15 2026 1:17 AM | Updated on Mar 15 2026 1:17 AM

అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అరకులోయ టౌన్‌: గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో పాడి పశువుల పాత్ర కీలకమని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. శనివారం స్ధానిక పశువైద్యశాలలో జాతీయ పశువ్యాధి నియంత్రణకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పశువులు వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. పశువైద్యాధికారి సాగరి గణేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ఈనెల 16 నుంచి వచ్చే నెల 29 వరకు జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement