1400 లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

1400 లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం

Mar 15 2026 1:17 AM | Updated on Mar 15 2026 1:17 AM

పులుపును ధ్వంసం చేస్తున్న

నాతవరం పోలీసులు

నాతవరం: సారా తయారు చేసేందుకు నిల్వ చేసిన పులుపును ధ్వంసం చేసినట్టు స్థానిక ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు శనివారం తెలిపారు. మండలంలో తాండవ జంక్షన్‌–గాంధీనగరం మధ్య పెడిమికొండ అటవీ ప్రాంతంలో సారా తయారు చేస్తున్నట్టుగా సమాచారం వచ్చిందన్నారు. సిబ్బందితో కలిసి దాడి చేసి, సారా తయారు చేసేందుకు నిల్వ చేసిన 1,400 లీటర్ల పులుపును ధ్వంసం చేసినట్టు చెప్పారు. సారా తయారీ, విక్రయం చట్టరీత్యా నేరమన్నారు. ఎక్కడైనా సారా తయారీ చేస్తే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement