పల్సర్‌బైక్ చోరీ కేసులో నిందితుడిని అదుపులోనికి తీసుకున్న ఎస్‌ఐ సంతోష్‌కుమార్
అనకాపల్లి : బైక్‌ల చోరీకి పాల్పడుతున్న పసుపులేటి రామును మండలంలో కొత్తూరు జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకుని అదుపులోనికి తీసుకోవడం జరిగిందని ఎస్‌ఐ కె.సంతోష్ కుమార్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన పసుపులేటి సంతోష్ గతంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బైక్‌ల చోరీలకు పాల్పడ్డాడని ఎస్‌ఐ చెప్పారు. అతని వద్ద నుంచి రెండు పల్సర్ బైక్‌లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్టు ఎస్‌ఐ చెప్పారు.


