అర్జీదారుల సమస్యను వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 49 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు – 26, కుటుంబ కలహాలు – 2, మోసపూరిత వ్యవహారాలు – 2, ఇతర విభాగాలకు చెందినవి – 19 అర్జీలు వచ్చాయన్నారు. అర్జీదారుల సమస్యలు వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు పాల్గొన్నారు.


