బొత్సను కలిసిన చిక్కాల రామారావు
పాయకరావుపేట: రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణను పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. బొత్స సత్యనారాయణ ఇటీవల ఆనారోగ్యానికి గురై విశాఖపట్నంలో గల ఆయన స్వగృహాంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. చిక్కాల రామారావు ఆయన స్వగృహానికి వెళ్ళి ఆరోగ్య పరిస్ధితిని ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. బొత్స సత్యనారాయణ ఆరోగ్యంగా ఉండాలని, దేవున్ని ప్రార్ధిస్తున్నట్లు చిక్కాల రామారావు తెలిపారు.


