హుండీ ఆదాయం లెక్కింపు చేస్తున్న ఉద్యోగులు
అనకాపల్లి: స్థానిక సుంకరమెట్ట జంక్షన్ సత్యనారాయణ, సూర్యనారాయణ స్వామివార్ల హుండీ ఆదాయం 3 లక్షల 11 వేల 573 రూపాయలు వచ్చింది. దేవదాయ శాఖ ఈవో బి.మురళీకృష్ణ, ఆలయ చైర్మన్ బొడ్డేడ మురళీల ఆధ్వర్యంలో ఆలయ ఉద్యోగులు హుండీ కానుకలు లెక్కించారు. వారు మాట్లాడుతూ మాఘ మాసంలో దర్శనానికి వచ్చిన భక్తులు సమర్పించిన ఆదాయం లెక్కించామన్నారు. ఇంత పెద్దమొత్తంలో ఎప్పుడు ఆదాయం రాలేదన్నారు. యూఎస్‌ఏ డాలర్, కెనడియన్ డాలర్ ఒకటి చొప్పున వచ్చిందన్నారు. భక్తుల టికెట్స్ ద్వారా రూ.1,72,650, వ్రతాలు టికెట్స్ ద్వారా రూ. 53,600, స్వామివారి ప్రసాదం అమ్మకం ద్వారా రూ.56,745, బంగారం 1.350 మిల్లీ గ్రాములు, వెండి 400 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం నగదును దేవదాయ ధర్మాదాయ శాఖ బ్యాంక్ ఖాతాలో జమ చేశామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


