అనకాపల్లి : భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం తన ప్రాణాలనే అర్పించిన మహనీయుడు, అమరజీవి పొట్టి శ్రీరాములకే దక్కిందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో సోమవారం శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాలని ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష భారత చరిత్రలో లిఖితంగా గుర్తింపు తీసుకురావడం జరిగిందన్నారు. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ సత్యం, అహింస, హరిజనోద్ధరణే ధ్యేయంగా జీవించిన గొప్ప వ్యక్తిత్వం ఆయనదన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారి హక్కుల కోసం పోరాడి, ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్ర సాధనకు మార్గదర్శకులుగా నిలిచిన ఆయన ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహన్‌రావు, ఎస్‌బీ డీఎస్పీ జీ.ఆర్.ఆర్.మోహన్, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐలు లక్ష్మణమూర్తి, బాల సూర్యారావు, వెంకట నారాయణ, ప్రేమ్ కుమార్, రమేష్, కృష్ణ్ణ, ఎస్‌ఐలు రమణయ్య, సురేష్ బాబు పాల్గొన్నారు.


