జిల్లా ప్రజలకు బూడి ఉగాది శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా ప్రజలకు బూడి ఉగాది శుభాకాంక్షలు

Mar 19 2026 7:49 AM | Updated on Mar 19 2026 7:49 AM

దేవరాపల్లి: పరాభవ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలకు సకల శుభాలు, విజయాలు సిద్ధించాలని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌, మాజీ డిప్యూటీ బూడి ముత్యాలనాయుడు ఆకాంక్షించారు. తారువలో బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ తెలుగు నూతన సంవత్సరాదిలో ప్రతి ఒక్కరూ అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తలతూగాలని మనసారా భగవంతుడిని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమృద్దిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా వృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement