ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆర్డీవో రమణ | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆర్డీవో రమణ

Mar 19 2026 7:49 AM | Updated on Mar 19 2026 7:49 AM

నర్సీపట్నం: పురపాలిక ప్రత్యేక అధికారిగా ఆర్డీవో వి.వి.రమణ బుధవారం బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్‌ కమిషనర్‌ జంపా సురేంద్ర, వివిధ విభాగాల అధికారులు ప్రత్యేక అధికారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యాలయ సిబ్బందితో సమావేశమై ఆయా విభాగాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో పురపాలక సంఘంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందుస్తుగా అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. నీటి ఎద్దడి గల ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని తెలిపారు. చేతిపంపులు వినియోగంలోకి తీసుకువస్తామని, శానిటేషన్‌ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులు ఈ నెలాఖరులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణంలో కొత్తగా కరెంట్‌ స్తంభాలు వేయించటనున్నట్టు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement