డుంబ్రిగుడ: మండలంలోని కితలంగి పంచాయతీ, దేవలయం గ్రామంలో విద్యార్థుల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆగ్రామంలో పర్యటించారు. ప్రాథమిక పాఠశాలకు సరైన భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణం నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. పాఠశాల భవన నిర్మాణంపై మండల విద్యాశాఖ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్, డీఈవోల దృష్టికి కూడా తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం పాడి గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కొర్ర పంచాయతీ నాయకులు ఎస్.బి. బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్‌కుమార్


