● జిల్లావ్యాప్తంగా 44 పరీక్షా కేంద్రాలు
● 7,804 మందికి హాల్ టికెట్లు
● పకడ్బందీగా ఏర్పాట్లు
సాక్షి,పాడేరు: జిల్లాలో ఈఏడాది టెన్త్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లాలోని 159 ఉన్నత పాఠశాలల పరిధిలో 7,804మంది విద్యార్థులు ఈనెల 16వతేదీ సోమవారం నుంచి జరగనున్న టెన్త్ పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్ధులందరికి హాల్‌టికెట్లు పంపిణీ పూర్తి చేసినట్టు విద్యాశాఖ అధికార వర్గాలు తెలిపారు. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 44 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి, విద్యార్ధులకు మౌలిక వసతులు కల్పించారు. బెంచీలతో పాటు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాల మేరకు టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని డీఈవో రామకృష్ణారావు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇన్విజిలేటర్లు, తనిఖీ బృందాల నియామకాలు పూర్తి చేశామన్నారు.
కొయ్యూరు: మండలంలో బాలారం జిల్లా పరిషత్ పాఠశాలతో కలిపి 15 పాఠఽశాలలకు చెందిన 589 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొయ్యూరు బాలుర ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వోన్నత పాఠశాల, గురుకుల పాఠశాలలో పరీక్ష రాస్తారన్నారు.
సీలేరు: టెన్త్ పరీక్షా కేంద్రాల్లో మాస్‌కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నామని డీవో ప్రసాద్ తెలిపారు. శనివారం సీలేరులో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సీలేరు గురుకుల పాఠశాల కేంద్రంలో ఐదు పాఠశాలలకు చెందిన 197 మందితోపాటు కంపార్ట్‌మెంట్ విద్యార్థులు కలిపి 240 మంది పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామని ఆయన పేర్కొన్నారు.


