25,492
1,43,
772
1,69,264 మందికి లబ్ధి
నాడు భరోసా..
హామీలేమో కొండంత.. అమలు మాత్రం గోరంత.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతేడాది వరకు సాయం పొందిన 25 వేల మందికి పైగా రైతులకు ఈసారి మొండిచేయే ఎదురైంది. పెట్టుబడి సాయం పెంచుతామని చెప్పి, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమేనా ‘సూపర్ సిక్స్’ అంటే అని వారు ధ్వజమెత్తుతున్నారు.
సాక్షి, పాడేరు: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి దిశగా సాగిన గిరిజన రైతులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో నిరాశే ఎదురవుతోంది. ఎన్నికల హామీల్లో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినప్పటికీ, ఆచరణలో మాత్రం వేల సంఖ్యలో రైతులపై కోత విధించడం గమనార్హం.
లబ్ధిదారుల సంఖ్యలో భారీ తగ్గింపు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అరకులోయ, పాడేరుతో పాటు రంపచోడవరం ( ప్రస్తుతం పోలవరం జిల్లా) నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,69,264 మంది గిరిజన రైతులకు ‘వైఎస్సార్ రైతు భరోసా’ లబ్ధి చేకూరింది. ఇందులో అటవీ భూములు (ఆర్వోఎఫ్‌ఆర్) సాగు చేసుకుంటున్న వారితో పాటు కౌలు రైతులు కూడా ఉండేవారు. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ సంఖ్యను 1,43,772కు కుదించింది. ఫలితంగా 25,492 మంది గిరిజన రైతులకు ఈ ఏడాది పెట్టుబడి సాయం అందకుండా పోయింది.
ఏడాది పాటు నిరీక్షించినా..
2024 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఆ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ఎలాంటి పెట్టుబడి సాయం అందించకుండా మొండిచెయ్యి చూపింది.గతంలో కౌలు రైతులకు లభించిన ప్రాధాన్యత ప్రస్తుత పథకంలో లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
25వేల మందికి ప్రశ్నార్థకం
గతేడాది ఆగస్టు, నవంబర్ నెలల్లో లబ్ధి పొందిన వారికి మాత్రమే ప్రస్తుతం సాయం అందుతోంది. పెండింగ్‌లో ఉన్న సుమారు 25 వేల మందికి పైగా రైతుల పరిస్థితి ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది.
వ్యవసాయంపై ఆర్థిక భారం
ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పంటల దిగుబడి తగ్గడమే కాకుండా, మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లేకపోవడం రైతులకు శాపంగా మారింది.వాణిజ్య పరంగా కాఫీ, మిరియం, రాజ్‌మా వంటి పంటలకు ఆశించిన ధరలు లభించడం లేదు. సంప్రదాయ పంటలైన పసుపు, పిప్పళ్లమోడి, జీడిమామిడి సాగు చేస్తున్న రైతులు ఆర్థిక నష్టాల్లో ఉన్నారు.
ప్రభుత్వ వైఫల్యం
గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనలోనూ కూటమి ప్రభుత్వం విఫలమైందనే ఆవేదన గిరిజనుల్లో కనిపిస్తోంది. పెట్టుబడి సాయం పెంచామనే సాకుతో వేలాది మంది అర్హులైన గిరిజన రైతులకు లబ్ధిని నిరాకరించడం గిరిజన ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రతిపక్షాల ఒత్తిడి పెరగడంతో పథకాన్ని ప్రారంభించినా, క్షేత్రస్థాయిలో కోతలు మాత్రం రైతులకు అన్యాయం చేస్తున్నాయి.
నేడు నిరాశ !
గిరి రైతు గుండె కోత వినేదెవరు?
సాయం అందలేదు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా రైతు భరోసా ఆర్థిక సాయం అందేది.కూటమి ప్రభుత్వం వచ్చాక మాత్రం అన్నదాత సుఖీభవ సాయం నిలిపివేసింది. పెట్టుబడి సాయం కోసం అనేక సార్లు అధికారులను అడిగినా ఫలితం లేకపోయింది.
– కొర్రా సింద్రి, గిరి రైతు, గుర్రగరువు,
పాడేరు మండలం
కౌలు రైతుకు కోత
ముంచంగిపుట్టు మండలం దోడిపుట్టు నుంచి వనుగుపల్లి ప్రాంతానికి వలస వచ్చి భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. ఈ ఏడాది పెట్టుబడి సాయం అందుతుందని ఆశపడ్డాం. చాలా మంది కౌలు రైతులకు అన్యాయం జరిగింది.
– సొమ్రో హరి, కౌలు రైతు, వనుగుపల్లి,
పాడేరు మండలం
తగ్గిన అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు
కోత విధించిన కూటమి ప్రభుత్వం
సుమారు 25 వేల మందికి మొండిచెయ్యి
సూపర్ సిక్స్ అంటే లబ్ధిదారులనుతగ్గించడమేనా?
రైతులు ధ్వజం
గిట్టుబాటు ధరలు కరువు
గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పనలో ప్రభుత్వం విఫలమైంది.కూటమి ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించకపోవడంతో దళారుల రాజ్యమవుతోంది. జీసీసీ కూడా పూర్తిస్థాయిలో కాఫీ కొనుగోలు జరపలేదు.
– పాలికి లక్కు, కాఫీ రైతుల
సంక్షేమ సంఘం, పాడేరు


