క్రైమ్ థ్రిల్లర్‌గా
తమిళసినిమా: చిన్న గ్యాప్ తరువాత కథానాయకుడిగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం సట్రెండ్రు మారుదు వానిలై. నటి మీనాక్షి గోవిందరాజన్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని బీవీ ఫ్రేమ్స్ పతాకంపై బీవీ.షర్మిళ నిర్మించారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మాదిరిగా హీరోయిన్ మీనాక్షి గోవిందరాజన్‌ను చూడగానే, హీరో జయ్‌కు ప్రేమ పుడుతుంది. అదేవిధంగా వీరిద్దరూ ఒక పబ్‌లో అనుకోకుండా ఒకరికొకరు తారసపడతారు. ఆ తరువాత జరిగిన ఒక సంఘటనలో పోకిరీల మధ్య చిక్కుకున్న హీరోయిన్‌ను హీరో కాపాడుతాడు. దీంతో ఆమెకు హీరోపై మంచి అభిప్రాయం కలుగుతుంది. అదేవిధంగా హీరోయిన్‌కు మరో సమస్య ఉత్పన్నం అవుతున్న తరుణంలో అనుకోకుండా అక్కడికి వచ్చిన హీరో ఆమెను రక్షించడంతోపాటు ఐ లవ్ యూ చెప్పేస్తాడు. ఆ తరువాత పెద్దలకు కూడా తెలియకుండా ఇద్దరు రిజిస్టర్ పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత జరిగే అనూహ్య సమస్యలు ఈ నూతన జంట జీవితంలో ఎలాంటి పరిణామాలు సంభవించాయి? హీరో ఎందుకు జైలు పాలయ్యాడు? వారు మళ్లీ కలుసుకున్నారా? వంటి పలు ఆసక్తికరమైన సంఘటనలతో రూపొందిన చిత్రం సట్టెండ్రు మారుదు వానిలై. ఈ చిత్రంలో గరుడారామ్, సత్యన్, శ్రీమాన్, ఆదిత్యకదిర్ ముఖ్యపాత్రలు పోషించారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతాన్ని, రిచర్డ్ ఎన్.నాథన్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.


