అథ్లెటిక్స్‌ నేపథ్యంలో ‘అంగీకారం’ | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌ నేపథ్యంలో ‘అంగీకారం’

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

తమిళ సినిమా: అథ్లెటిక్స్‌ క్రీడల నేపథ్యంలో చిత్రాలు వచ్చి చాలా కాలం అయ్యింది. కాగా తాజాగా ఆ క్రీడ ప్రధానాంశంగా రూపొందిన చిత్రం అంగీకారం. ఈ చిత్రం ద్వారా ఇంతకు ముందు పలు చిత్రాలకు నిర్మించిన కేజేఆర్‌ హీరోగా అవతారమెత్తారు. స్వస్తిక్‌ విజువల్స్‌ పతాకంపై ఈయన నిర్మించి కథానాయకుడుగా నటించిన ఈ చిత్రం ద్వారా తెన్‌ పాదియన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు పా.రంజిత్‌ శిష్యుడు అన్నది గమనార్హం. నటి విజీ వెంకటేష్‌, అజిత్‌ ఘోషీ,సిందూరి విశ్వనాథ్‌ హీరోయిన్‌ నటించగా, ఆంటోని, రంగరాజ్‌ పాండే, మన్సూర్‌ అలీఖాన్‌ , మోహన్‌ రామ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కాగా ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన కార్యక్రమంలో దర్శకుడు తెలుపుతూ పలు యదార్థ ఘటనల ఆధారంగా అథ్లెటిక్స్‌ నేపథ్యంలో రూపొందించిన కథా చిత్రం అంగీకారం అని తెలిపారు. చిత్రంలో అథ్లెటిక్స్‌ క్రీడాకారులు ఎదుర్కొనే ఆటంకాలు, ఈక్రీడా రంగంలో జరిగే అవకతవకలను తెరపై ఆవిష్కరించే కథా చిత్రం గా ఇది ఉంటుందన్నారు. ఒక క్రీడాకారుడు తనకు జరిగిన అన్యాయానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే చిత్ర ప్రధాన అంశమని తెలిపారు. ఈ చిత్రం కోసం రూ. 75 లక్షల వ్యయంతో భారీ కోర్టు సెట్‌ వేసి ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. కాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అంగీకారం చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతాన్ని, ఎ. విశ్వనాథ్‌ ఛాయాగ్రహణం అందించారు.

అంగీకారం చిత్రంలో కేజేఆర్‌

Advertisement
 
Advertisement
Advertisement