కొరుక్కుపేట: నాణ్యమైన, అధునాతన వాస్కులర్ సంరక్షణను అందించడంలో ఓ కీలక ముందడుగుగా, చైన్నెగ్రీమ్స్ రోడ్‌లోని అపోలో ఆసుపత్రిలో ‘సెంటర్ ఫర్ వీనస్ డిజార్డర్స్‌ను ప్రారంభించినట్లు అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది. ఈ కేంద్రం రోగి–కేంద్రీకృత విధానం ద్వారా అన్ని రకాల రుగ్మతలకు సమగ్ర చికిత్సను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా ప్రారంభించబడిన ఈ కేంద్రం, రోగులకు రోగ నిర్ధారణ, చికిత్స తదుపరి పర్యవేక్షణను సజావుగా అందించడానికి, వాస్కులర్ సర్జరీ, రేడియాలజీ, డెర్మటాలజీ, గాయాల సంరక్షణ వంటి అన్ని ప్రత్యేక విభాగాలను ఒకే చోటకి తీసుకువచ్చిందని అపోలో హాస్పిటల్స్ చైన్నె రీజియన్ సీఈఓ డాక్టర్ ఇలంకుమారన్ తెలిపారు.ఆయన మాట్లాడుతూ, వీనస్ డిజార్డర్స్ కేంద్రాన్ని ప్రారంభించడంతో, తరచుగా నిర్ధారణ కాకుండా, సరిగా చికిత్స పొందకుండా ఉండిపోయే రుగ్మతల సమూహాన్ని ఎదుర్కోవడంలో తాము గణనీయమైన పురోగతిని సాధించామన్నారు. తమ బహుళ–విభాగాల విధానం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, మా రోగులకు సకాలంలో, సమర్థవంతంగా, అతి తక్కువ కోతతో కూడిన చికిత్సను అందించడం, తద్వారా వారి జీవన నాణ్యతను దీర్ఘకాలిక ఫలితాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమని తెలిపారు. చైన్నె, గ్రీమ్స్ రోడ్‌లోని అపోలో హాస్పిటల్స్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్, వాస్కులర్ సర్జన్ డాక్టర్ బాలాజీ, అపోలో హాస్పిటల్స్, గ్రీమ్స్ రోడ్ సీఈఓ నవీన్, డాక్టర్ అనిల్‌తో పాటు సీనియర్ వైద్య నిపుణులు హాజరయ్యారు.


