తమిళసినిమా: దర్శకుడు ఏఆర్.మురుగదాస్ శిష్యుడు బాబు విజయ్ దర్శక నిర్మాతగా పరిచయం అయ్యి బీవీ.ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం సట్రెంన్రు మారుదు వానిలై. ఈయన దర్శకుడు ఏఆర్.మురుగదాస్ శిష్యుడు కావడం గమనార్హం. అదే విధంగా బోఫ్టా ఫిలిం ఇన్‌స్టిట్యూట్ విద్యార్థి కూడా. కాగా నటుడు జయ్, మీనాక్షీ గోవింద రాజన్ జంటగా నటించిన ఈ చిత్రంలో యోగిబాబు, గరుడా రామ్, శ్రీమాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రిచ ర్డ్ ఎం.నాథన్ ఛాయాగ్రహణం, గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 15న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఫ్రీ రిలీజ్ కార్యక్రమాన్ని సోమ వారం సాయంత్రం స్థానిక టీ.నగర్‌లోని కృష్ణవేణి థియేటర్లో నిర్వ హించారు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్, శశి, నిర్మాత ధనుంజయ న్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ ఈ చిత్ర దర్శక నిర్మాత బాబు విజయ్ తనకు చాలా సన్నిహితుడు అన్నారు. అంతేకాదు చాలా క్లిష్టమైన సమయంలో తన పక్కన నిలబడ్డాడని పేర్కొన్నారు. ఇకపోతే తన వద్ద పనిచేసిన వారు ఇప్పటికీ 12 మంది దర్శకులు అయ్యాయన్నా రు. వారిలో ఒకరైన బాబు విజయ్ దర్శక నిర్మాతగా రూ పొందించిన తన తొలి చిత్రం విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. తన వద్ద పనిచేసినప్పుడు రోజు ఏడు,ఏడున్నరకు వచ్చి కింద కారు వద్ద నిలబడే వాడిని, షూటింగ్ స్పాట్ లో రిహార్సల్స్ నుంచి అని నిర్వహించి సిద్ధంగా ఉండేవాడన్నారు. అంత శ్రమజీవి అనీ..ఇంకా చెప్పాలంటే తనను సోంబేరిగా మార్చిన సహాయ దర్శకుల్లో ముఖ్యమైన వ్యక్తి బాబు విజయ్ అని అన్నారు. తన దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకోనని, దేవుడిని ప్రార్థిస్తానని ఏఆర్ మురుగదాస్ పేర్కొన్నారు.


