విలక్షణ నటనతో పబ్లిక్‌ స్టార్‌గా..! | - | Sakshi
Sakshi News home page

విలక్షణ నటనతో పబ్లిక్‌ స్టార్‌గా..!

May 15 2026 10:14 AM | Updated on May 15 2026 10:14 AM

తమిళసినిమా: ఏ తరహా పాత్రలు అయినా పోషించే వారే నటులు. అందుకే చాలా మంది హీరోలుగా కాకుండా మంచి నటులు అనిపించుకోవాలని కోరుకుంటారు. అలాంటి కోవకు చెందిన నటుడు దురై సుధాకర్‌. అందుకే ఈయన్ని అభిమానులు పబ్లిక్‌ స్టార్‌ సుధాకర్‌ అని పిలుస్తుంటారు. ఏ తరహా పాత్రలో నైనా తనదైన ముద్ర వేసుకునే దురై సుధాకర్‌ తప్పాట్టం చిత్రంలో గుబురు గడ్డంతో శోకమైన పాత్రలో నటించి ఆ పాత్రకు జీవం పోశారు. పలువురి ప్రశంసలు అందుకున్న పబ్లిక్‌ స్టార్‌ దురై సుధాకర్‌ ఎక్స్‌ ప్లొట్‌ ఫామ్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ నుంచి అభినందనలు అందుకున్నారు. అదేవిధంగా సర్గుణం దర్శకత్వంలో విమల్‌, ఓవియ జంటగా నటించిన కళవాణి – 2 చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి మంచి గుర్తింపును పొందారు. నటి వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన డేనీ చిత్రంలో పోలీస్‌ అధికారిగా నటించి తన సత్తా చాటుకున్నారు. ఇలా పలు రకాల పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా రాణిస్తున్న ఈయన తాజాగా మరోసారి ఎగ్జామ్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నిజాయితీ పరుడైన పోలీస్‌గా కీలక పాత్రను నటించారు. పుష్కర్‌ –గాయత్రిలో ద్వయం తమ వాల్‌ వాచ్చర్‌ పతాకంపై సర్గుణం దర్శకత్వంలో నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌ శుక్రవారం నుంచి ప్రైమ్‌ టైమ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో తన పాత్రకు మంచి పేరు వస్తుందనే నమ్మకాన్ని పబ్లిక్‌ స్టార్‌ దురై సుధాకర్‌ వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement