సాక్షి, చైన్నె: తమిళనాడులో కొత్తగా బాధ్యతలు చేపట్టి న ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనుందని ఆర్థిక మంత్రి సెంగోట్టయ్యన్ వెల్లడించారు. కోయంబత్తూ రు విమానాశ్రయంలో ఆదివారం ఆయన మీడియా తో మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యం కోసం, మిగిలిన మంత్రి పదవుల భర్తీని ముఖ్యమంత్రి విజయ్ క్ర మంగా చేపడతారని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇంకా 15 మందిని మంత్రులుగా తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు త్వరలోనే మరో 13 మందిని క్యాబినెట్‌లోకి తీసుకుని మంత్రిత్వ శాఖల పరిధిని విస్తరించనున్నట్లు సెంగోట్టయ్యన్ తెలిపారు. గతంలో జయలలిత మొదట చిన్న క్యాబినెట్‌తో ప్రారంభించి ఆ తర్వాత క్రమంగా విస్తరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
విజయ్ సంచలన నిర్ణయాలు
200 యూనిట్ల ఉచిత విద్యుత్, 717 మద్యం దుకాణాల మూసివేత వంటి కార్యక్రమాలతో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ కాలంలోనే విజయ్ చారిత్రాత్మక విజయాలు సాధించారని మంత్రి కొనియాడారు. భారతదేశంలో మరెవరూ ఇంత వేగవంతమైన నిర్ణయాలు తీసుకోలేదన్నారు. మహిళల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, బస్ స్టాండ్‌ల సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం ఒక మైలురాయి అని సెంగోట్టయ్యన్ ప్రశంసించారు.
వారికి ఎవరు పదవులు ఇస్తామన్నారు
మంత్రివర్గంలోఅన్నాడీఎంకే ఎమ్మెల్యేల చేరికపై మీడి యా ప్రశ్నించగా.. ‘సీఎం విజయ్ ఏది ఆలోచించినా దాన్ని అమలు చేయడమే తమ బాధ్యతగా పేర్కొన్నా రు. మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి స్వయంగా తన హోదా నుంచే తుది నిర్ణయం తీసుకుంటారని సెంగోట్టయ్యన్ స్పష్టం చేశారు. అయితే, వారికి మంత్రి పదవులు ఇస్తామని ఎవరు చెప్పారని, ఇంత వరకు అలాంటి ప్రస్తావనే లేదన్నారు. ఏనిర్ణయమైనా తమ నాయకుడు, సీఎం విజయ్ తీసుకుంటారని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా మంత్రి వర్గంలో చేరడం గురించి ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం, ఎంఆర్ విజయ భాస్కర్, విజయ భాస్కర్ తదితర అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆదివారం చైన్నెలో సమావేశం కావడం ప్రాధాన్యకు దారి తీసింది.


