లిక్కర్‌ షాపులపై విజయ్‌ సంచలన నిర్ణయం | Tamil Nadu CM Vijay Sensational Decision, Govt Shuts 717 TASMAC Liquor Shops Near Temples, Schools And Bus Stands | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ షాపులపై విజయ్‌ సంచలన నిర్ణయం

May 12 2026 9:18 AM | Updated on May 12 2026 9:40 AM

Tamil nadu CM Vijay Big Decision On Liquor Shops

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్‌ పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే కీలక హామీల ఫైల్స్‌పై ఆయన సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మహిళల భద్రతకు సంబంధించిన టీం పర్యవేక్షణ తన ఆధీనంలో ఉంచుకోవాలని ఆయన నిర్ణయించారు. తాజాగా మద్యం దుకాణాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది విజయ్‌ సర్కార్‌.

టాస్‌మాక్‌(Tamil Nadu State Marketing Corporation Limited) పరిధిలోని 717 మద్యం దుకాణాలు మూసేయాలని టీవీకే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకుగానూ రెండు వారాల గడువు విధించింది. ఇవి ఆలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలు, బస్‌స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో  ఉండడమే కారణమని తెలుస్తోంది. 

మూసివేయబడే దుకాణాలు: 717

276 – ఆధ్యాత్మిక స్థలాల దగ్గర

186 – విద్యాసంస్థల దగ్గర

255 – బస్‌స్టాండ్ల దగ్గర

కాలపరిమితి: రెండు వారాల్లో ఈ దుకాణాలను మూసివేయాలని ఆదేశం.

టాస్‌మాక్‌ అనేది తమిళనాడు ప్రభుత్వం 1983లో ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల నిర్వహణను ఇదే చూసుకుంటోంది. అంటే అక్కడ ప్రైవేట్‌ షాపులు ఉండవన్నమాట. ప్రస్తుతం దీని పరిధిలో 4,765 దుకాణాలు (-717) ఉన్నాయి. విజయ్‌ తీసుకున్న తాజా నిర్ణయం ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నిర్ణయంపై మహిళలు, తల్లిదండ్రుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం కావొచ్చంటున్నారు.  అయితే, TASMAC ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయంపై ప్రభావం పడనుంది.

తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గి విజయ్‌ టీవీకే పార్టీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ మెజారిటీ లేకపోవడంతో కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీ, వీసీకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారాయన. 

Advertisement
 
Advertisement
Advertisement