తిరుత్తణి ఆలయంలో వైఖాసి కృత్తిక సందడి | - | Sakshi
Sakshi News home page

తిరుత్తణి ఆలయంలో వైఖాసి కృత్తిక సందడి

May 17 2026 12:48 AM | Updated on May 17 2026 12:48 AM

తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో వైఖాసి కృత్తిక సందర్భంగా భక్తజనం సందడి నెలకొంది. వైఖాసి మాసం కృత్తిక సందర్బంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శనివారం ఉదయం మూలవర్లకు విభూది, చందనం, సహా సుగందద్రవ్యాలతో పాటు పంచామృత అభిషేక పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలతో అలంకరించి బంగారు కవచం తొడిగి మహా దీపారాధన పూజలు చేపట్టారు. కృత్తికతో తమిళనాడులో పలు ప్రాంతాల నుంచి భక్తులు రైళ్లు, బస్సులు, వాహనాలతో పాటు ద్విక్షక్ర వాహనాల్లో కొండకు పోటెత్తారు. దీంతో కొండ ఆలయంలో రద్దీ నెలకొంది. భక్తులు మొక్కులు చెల్లించే విధంగా తలనీలాలు సమర్పించి శరీంకు ఇనుప చువ్వలు గుచ్చుకుని కావళ్లు మోస్తూ మెట్ల మార్గంతో పాటూ ఘాట్‌ రోడ్డులో కొండ ఆలయంకు చేరుకుని ఉచిత దర్శనం క్యూలైన్‌లో మూడు గంటల పాటూ వేచివుండి స్వామికి తమ మొక్కులు చెల్లించి స్వామి దర్శనం చేసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. రాత్రి స్వామివారు వాహన సేవలో కొలువుదీరి ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement