టీవీకేలోకి అన్నాడీఎంకే మాజీ మంత్రి | - | Sakshi
Sakshi News home page

టీవీకేలోకి అన్నాడీఎంకే మాజీ మంత్రి

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ఈరోడ్‌ నగర కార్యదర్శి పదవి నుంచి తొలగించబడిన మాజీ మంత్రి కె.వి.రామలింగం శుక్రవారం టీవీకేలో చేరారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మద్దతుగా వ్యవహరిస్తున్న వారిని అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎడపాడి పళనిస్వామి తొలగిస్తున్నారు. ఈరోడ్‌ నగర, జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసిన మాజీ మంత్రి కె.వి.రామలింగంను కూడా ఆయన పదవి నుంచి తొలగించారు. దీంతో కె.వి.రామలింగం గోబిచెట్టి పాళయంలో మంత్రి సెంగోట్టయ్యన్‌ సమక్షంలో టీవీకేలో మద్దతుదారులతో కలిసి చేశారు.

యూట్యూబ్‌ చానెల్‌

క్రియేషన్‌పై శిక్షణ

సాక్షి, చైన్నె: డిజిటల్‌ కంటెంట్‌ క్రియేషన్‌ రంగంలో యువతను ప్రోత్సహించేందుకు తమిళనాడు ప్రభుత్వానికి చెందిన ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌న్‌ స్టిట్యూట్‌ చర్యలు తీసుకుంది. చైన్నె ఒక సరికొత్త శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించింది. ‘మీ సొంత యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించండి‘ అనే అంశంపై మే 25 నుంచి 27 వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వీడియో, స్లైడ్‌షోల తయారీ, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ , ప్లాట్‌ఫారమ్‌ ఇంటిగ్రేషన్‌, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ పద్ధతులు, కస్టమర్‌ నెట్‌వర్క్‌ను పెంచుకునే వ్యూహాలపై శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ గిండి ఈకాట్టు తాంగల్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆవరణలో జరుగుతుందని, 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండి, 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. శిక్షణ పూర్తిచేసిన వారికి ప్రభుత్వం తరఫున సర్టిఫికేట్‌ అందజేయనున్నట్టు తెలిపారు.

పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు

తిరువళ్లూరు: పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలకు కల్పించాలని కలెక్టర్‌ ప్రతాప్‌ సూచించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌లోని ఉలుందై గ్రామంలో శుక్రవారం జరిగిన కేఎస్‌టీ ప్లాంట్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు తయారు చేస్తున్న క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఏర్పడాలని ఆయన సూచించారు. తిరువళ్లూరు జిల్లా రాష్ట్ర రాజధాని చైన్నెకి సమీపంలోని జిల్లా. తిరువళ్లూరు వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని సూచించారు. కాంచీపురంలోని పరందూరు విమానశ్రయం, మప్పేడులో రైల్వే గోడౌన్‌ ట్రాక్‌ కనెక్టవిటీ, ఎన్నూరు, కారపాక్కం పోర్టులు అందుబాటులో వున్న క్రమంలో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. అయితే పరిశ్రమలు ఏర్పాటు చేసిన తరువాత ఉద్యోగ ఉపాది అవకాశాల్లో ఎక్కువగా స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement