ముగిసిన ఘంటసాల జాతీయ మహాసభలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఘంటసాల జాతీయ మహాసభలు

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

కొరుక్కుపేట: ఆల్‌ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక (ఏఐజీసీవీ), మిత్ర సంఘాల ఆధ్వర్యంలో చైన్నెలో నిర్వహించిన 16వ జాతీయ హాసభలు ఆదివారంతో విజయవంతంగా ముగిసాయి. చైన్నె మైలాపూర్లోని అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక భవనంలో అమరజీవి పొట్టి శ్రీరాములు, అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు చిత్రపటాలకు ఏఐజీసీవీ అధ్యక్షుడు కోట వెంకటేశ్వరరెడ్డి పూలమాలలు వేసి నిర్వాహకులతో కలిసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో తమ సంస్థ తరఫున మహాసభలు నిర్వహించి తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. శని, ఆదివారాలు జరిగిన ఈ కార్యక్రమాల్లో ఘంటసాల సంగీత విభావరిలో గాయకులు ఎంఆర్‌ సుబ్రమణ్యం, కిడాంబి లక్ష్మీకాంత్‌, జయప్రభు, సుహాసిని, కేవీబీ ఆనంద్‌, తారకరామ శర్మ, సోము ఉమాపతి సినీ గీతాలను ఆలపించారు. అలాగే ఏఐజీసీవీ కార్యదర్శి చింతకాయల చిట్టిబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున కూచిపూడి, భరతనాట్యం, శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు, దేశభక్తి గీతాలతో కళాకారులు అందరిని ఆకట్టుకున్నారు. జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, తమిళనాడు సైన్స్‌ ఫారమ్‌ ప్రతినిధులు అంబికా, సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement