తమిళసినిమా: ప్రముఖ నటుడు రవి మోహన్‌ను ఉత్సవం 2026 సంస్థ నిర్వాహకులు దేవి రత్న అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో గాయని కెనిషా సంగీత కచేరీ ప్రత్యేకతను సంతరించుకుంది. పాలకాడుకు చెందిన పళయకావు శ్రీ మీనాకుమారి భగవతి ఆలయం నేతృత్వంలో కొన్ని ఏళ్లుగా భక్తి, సంస్కృతి, సినిమా, సంగీత రంగాల్లో విశేష కృషిచేసిన వారిని సత్కరించి అవార్డులను ప్రదానం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాదికి గాను ఉత్సవం 2026 అవార్డుల కార్యక్రమాన్ని ఇటీవల పాలకాడులో ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై తమిళ ప్రముఖ నటుడు రవి మోహన్ దేవి రత్న పేరుతో అవార్డును ప్రధానం చేయడంతో పాటు ఘనంగా సత్కారించి రూ. 1000001 (పది లక్షల ఒక్కరూపాయి) నగదు బహుమతి అందించారు. ఇది పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో, రవి మోహన్ నటనా చాతుర్యానికి, చిత్ర పరిశ్రమకు అందిస్తున్న విశేష సేవలకు, అత్యంత అభిమానులను కలిగినందుకు గానూ ఈ అవార్డు ప్రధానం అని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా నటుడు రవి మోహన్ స్నేహితురాలు, గాయని కెనీషా బందం సంగీత కచేరీ కార్యక్రమం ఆహుతులను ఎంతగా అలరించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. వారికి నటుడు రవి మోహన్, గాయని కెనీషా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ధన్యవాదాలు తెలియజేశారు.


