సాక్షి, చైన్నె : తమిళనాడులో అసాధారణ వృద్ధిని నమోదు చేసి ఆర్డర్లు ఐదు రెట్లకు పెంచినట్టు అమెజాన్ ఇండియా పరిధిలోని అమెజాన్ బజార్ హెడ్ సమీర్ లాల్వానీ ప్రకటించారు. గురువారం చైన్నెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమెజాన్ బజార్‌కు తమిళనాడు అత్యంత కీలకమైన వృద్ధి మార్కెట్‌గా నిలిచిందన్నారు. ఈ వృద్ధిలో రాజధాని చైన్నె అగ్రస్థానంలో నిలవడమే కాకుండా, ఇక్కడ కొత్త కస్టమర్ల సైన్–అప్‌లు 2 రెట్లు పెరిగాయని వివరించారు.. చైన్నెతో పాటు వేలూరు, మధురై, తిరుచ్చి నగరాల నుంచి కూడా భారీగా ఆర్డర్లు వస్తున్నట్లు వివరించారు. పలు ఆఫర్లతో 3 కోట్లకు పైగా ఉత్పత్తులను అందిస్తున్నామన్నారు. తమిళనాడులో అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌పై మొత్తం లక్ష మందికి పైగా విక్రేతలు ఉండగా, అందులో 1,700 మందికి పైగా వ్యాపారులు నేరుగా ’అమెజాన్ బజార్’ ద్వారా విక్రయాలు జరుపుతున్నారని వివరించారు. తమిళనాడులో 7 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, 4 సార్టేషన్ సెంటర్లు ,సుమారు 1,600 మంది హబ్ డెలివరీ పార్ట్‌నర్లు పనిచేస్తున్నారని తెలిపారు.


