సాక్షి, చైన్నె : సీఎం విజయ్ ప్రభుత్వానికి మొదటి సవాల్‌గా ఆర్థిక పరిస్థితులు మారున్నాయి. గురువారం జరిగిన అధ్యయనంలో వెలుగు చూసిన అంశాలు తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై కలవరాన్ని రేపినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఐదు దశాబ్దాల ద్రవిడ కోటను బద్దలు కొట్టిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి ఆర్థిక పరీక్ష అన్నది మున్ముందు ఎదురు కానున్నట్టు చర్చ ఊపందుకుంది. కొత్తగా ఏర్పడిన విజయ్ ప్రభుత్వం తాజాగా వాగ్దానాల అమలు విషయంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నట్టుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన కొత్త పరిపాలన యంత్రాంగం సజావుగా సాగాలంటే, ప్రస్తుతం తమిళనాడు ఎదుర్కొంటున్న తీవరౖమైన ఆర్థిక వాస్తవాలను, సవాళ్లను అధిగమించాల్సి ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకోసం పటిష్టమైన విధానపరమైన నిర్ణయాలు, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ ఎంతో అవసరమని చెబుతున్నారు. గురువారం సీఎం విజయ్ ఆర్థిక శాఖ వర్గాలతో సుదీర్ఘంగా చర్చలు జరపడం గమానార్హం. ఇందులో ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాలు,రాష్ట్ర అప్పుల నిర్వహణ అంశాలు సవాల్‌గా మారి ఉన్నట్టుగా అంశాలు వెలుగులోకి వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వానినికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టాస్మాక్ మద్యం దుకాణాల దశలవారీగా మూతపనులు వేగవంతం చేశారు. 717 దుకాణాల మూతకు తాజాగా ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో గతరెండు రోజులలో వందకు పైగా దుకాణాలను ఇందులో మూసి వేశారు. అలాగే, 21 సంవత్సరాలలోపు వారికి మద్యం విక్రయించ కూడదంటూ టాస్మాక్ దుకాణాలసిబ్బందికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హెచ్చరికలు వెళ్లారు. ఎవరైనా విక్రయించిన పక్షంలో వారిపై చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.


