వేలూరు: ఆధార్ కార్డు సేవా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి నియోజకవర్గం పరిధిలోని విరుదంబట్టులో కొత్తగా ఆధార్ సేవా కేంద్రాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ప్రజలు ఇప్పటివరకు నూతన ఆధార్ కార్డు, పేర్లు, చిరునామా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వేలూరు కలెక్టరేట్, తాలుకా కార్యాలయాల్లోని ఆధార్ సేవా కేంద్రాలతోపాటు ప్రధాన తపాలా కార్యాలయం, జాతీయ బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడ తరచూ రద్దీగా ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నూతనంగా విరుదంబట్టులో ప్రారంభించామన్నారు. ఇక్కడ రోజుకు 500 మంది వరకు లబ్ధిపొందే అవకాశం ఉందన్నారు. ఇక్కడ ఆధార్ బయో మెట్రిక్ చేసేందుకు రూ.125 రుసుము వసూలు చేస్తారన్నారు. 5 నుంచి 17 సంవత్సరాలలోపు ఉన్న వారికి సప్టెంబర్ 30వ తేదీ వరకు ఉచితంగా అప్‌డేట్ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఆధార్ కార్డు కోసం వచ్చే వారికి అవసరమైన వసతులు ఏర్పాటు చేశారా లేదా అని నేరుగా వెళ్లి ఆమె పరిశీలించారు.


