– మహిళ సహా నలుగురు అరెస్టు
అన్నానగర్: కుంభకోణం సమీపంలోని మనప్పడైయూర్‌లో లైసెన్సు లేకుండా పేలుడు పదార్థాలు తయారు చేస్తున్న ఓ మహిళ సహా నలుగురిని అరెస్టు చేశారు. పేలుడు పదార్థాలు తయారు చేసిన ఇంటిని కూడా సీల్ చేశారు. వివరాలు.. తంజావూరు జిల్లాలో ని కుంభకోణం సమీపంలో ఉన్న తిరువలంచుళి మన ప్పడైయూర్ గ్రామంలోని ఓ స్థానిక పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో కొన్ని రోజుల క్రితం, జరిగిన పేలుడులో రెండు భవనాలు నేలమట్టమయ్యా యి. ఈ ఘటన రాత్రి జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం నెలకొంది. దీనితర్వాత, పోలీసులు ఆ ప్రాంతాల్లోని పేలు డు పదార్థాల తయారీ కర్మాగారాలు, గిడ్డంగులు, ఇళ్ల లో ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. ఈ స్థితిలో ఆదివారం తిరువలంచుళి సమీపంలోని మనప్పడైయూర్ రోడ్డులో ఉన్న ఒక ఇంటిని గహనిర్మిత పేలు డు పదార్థాల తయారీకి ఉపయోగిస్తున్నట్లు గుర్తించా రు. పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా, వారు ప్రభుత్వ లైసెన్సు లేకుండా రహస్యంగా పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నట్లు తేలింది. అనంతరం, పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించిన కిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, పేలుడు పదార్థాలు తయారు చేసిన కుటుంబానికి చెందిన అరుల్ డేవిడ్ (33), అరుల్ సెల్వన్ (48), మణికంఠన్ (35), శశి మేరీ (38)ను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


