కంకణం ఫస్ట్‌లుక్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

కంకణం ఫస్ట్‌లుక్‌ విడుదల

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

కంకణం ఫస్ట్‌లుక్‌ విడుదల

తమిళసినిమా: కల్యాణి ఈ ఎంటర్‌ ప్రైజర్స్‌ పతాకంపై కల్యాణి.కే.సిరంధన్‌ కేజీ కలిసి నిర్మిస్తున్న చిత్రం కంకణం. ఏ.ఇసైయరసన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన జాతీయ నాటక పాఠశాల శిక్షకుడు కావడం గమనార్హం.ఇంతకు ముందు ఎన్‌.కన్నే అనే షార్ట్‌ ఫిలిం చేసి ఐదు అవార్డులు పొందారు. ఇందులో కూత్తుపట్టరై సౌందర్‌ కథానాయకుడిగా నటించగా, నటి అశ్విని చంద్రశేఖర్‌, పిరాణ నటించారు. పరుత్తివీరన్‌ శరవణన్‌ కీలక పాత్రను పోషించిన ఇందులో సంపత్‌రామ్‌ ప్రతినాయకుడిగా నటించారు. విజయ్‌ టీవీ రామర్‌, సేతుపతి, జయచంద్రన్‌, కయల్‌ మణి, కేఎస్‌.వళ్లల్‌ ముఖ్య పాత్రలు పోషించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ చిత్ర షూటింగ్‌ను చైన్నె, మేలూర్‌, తేనీ, అదిరామ్పట్టినమ్‌, పుదుకోట్టై ప్రాంతాల్లో 53 రోజుల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను శుక్రవారం నిర్మాత కలైపులి ఎస్‌.థాను విడుదల చేసి యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారన్నారు. ఈ చిత్రానికి జీఏ.శివసుందల్‌ చాయాగ్రహణం, సెల్వ సంగీతాన్ని, తమీమ్‌ అన్సారీ నేపథ్య సంగీతాన్ని అందించారు.

ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలైపులి ఎస్‌.థానుతో యూనిట్‌ సభ్యులు

Advertisement
 
Advertisement
Advertisement