సమస్యల పరిష్కారం కోసం.. | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారం కోసం..

May 18 2026 6:51 AM | Updated on May 18 2026 6:51 AM

● అన్ని వార్డుల్లోను క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు

వేలూరు: వేలూరు నియోజక వర్గంలోని సమస్యలను తెలుసుకునేందుకు అన్ని వార్డుల్లోను క్యూ ఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేయనున్నట్లు టీవీకే వేలూరు ఎమ్మెల్యే వినోద్‌ కన్నన్‌ అన్నారు. వేలూరు అసెంబ్లీ నియోజక వర్గంలో టీవీకే ఎమ్మెల్యే విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం ఉదయం వేలూరు అన్నా రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయనకు వేలూరులోని ఆ పార్టీ జిల్లా కార్యదర్శులు, యూనియన్‌ కార్యదర్శులు, విజయ్‌ అభిమానుల సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో చేరుకొని సాలువ కప్పి సన్మానించారు. అనంతరం కేవీ కుప్పం ఎమ్మెల్యే తెండ్రల్‌కుమార్‌, గుడియాత్తం ఎమ్మెల్యే సిందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట అభిమానుల కోసం సుమారు ఐదు వేల మందికి బిర్యాని విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వినోద్‌ కన్నన్‌ విలేకరులతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే కార్యాలయంలో రోజూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తాను అసెంబ్లీకి వెళ్లినా కార్యాలయంలో ఇద్దరిని నియామకం చేయడంతో పాటు అన్ని వార్డుల్లోను గ్రామ పంచాయతీలోనూ క్యూ ఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను వాటి ద్వారా తెలుసుకుంటామన్నారు. అదే విధంగా సమస్యలను 24 గంటల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. మరో మూడు నెలల పాటూ నియోజక వర్గంలోని ప్రతి వార్డుకు వెళ్లి ఇంటింటికి వెల్లి కృతజ్ఞతలు తెలియజేయనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement