సాక్షి, చైన్నె: నాణ్యత, నూతన ఆవిష్కరణలు , సమకాలీన డిజైన్లకు మారుపేరైన ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జోస్ అలుక్కాస్ తమిళనాడులో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ కళ్లకురిచ్చిలో శనివారం సిగ్నేచర్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. దీనిని సినీ నటి కీర్తీ సురేష్ ప్రారంభించింది. కళ్లకురిచ్చి ఎమ్మెల్యే సి. అరుళ్ విఘ్నేష్, మున్సిపాలిటీ చైర్మన్ ఆర్. సుబ్బరాయులు, వైస్ చైర్మన్ కె. అబ్దుల్ రజాక్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జోస్ అలుక్కాస్ మేనేజింగ్ డైరెక్టర్లు వర్గీస్ అలుక్కాస్, పాల్ అలుక్కాస్ జాన్ అలుక్కాస్ కూడా పాల్గొన్నారు. వినియోగదారులకు సరికొత్త ఆభరణాల షాపింగ్ అనుభూతిని అందించేలా ఈ స్టోర్‌ను తీర్చిదిద్దారు: అత్యంత భారీ శ్రేణిలో సర్టిఫైడ్ బంగారు ఆభరణాల కలెక్షన్ అందుబాటులో ఉంచారు. అంతర్జాతీయ సర్టిఫైడ్ వజ్రాభరణాల తో పాటు ప్లాటినం, వెండి ఆభరణాల లేటెస్ట్ డిజైన్లు ఇక్కడ కొలువుదీర్చారు. ఈసందర్భంగా నటి కీర్తి సురేష్ మాట్లాడుతూ, జోస్ అలుక్కాస్ కుటుంబంలో భాగం కావడం, వారి విజయ ప్రస్థానంలో మరో మైలురాయిని దగ్గరుండి చూడడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. సంప్రదాయాలు, వేడుకలతో ఆభరణాలకు విడదీయరాని బంధం ఉందని, జోస్ అలుక్కాస్ నైపుణ్యం, చక్కదనం , వైవిధ్యాన్ని జోడించి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అద్భుతమైన వజ్రాభరణాలను అందిస్తున్నట్టు పేర్కొన్నారు.


