వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ హుండీలో రూ. 4 కోట్ల 33 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ తెలిపారు. ఆలయంలో ప్రతి నెలా పౌర్ణమి అనంతరం హుండీలో భక్తులు చెల్లించిన ఆదాయాన్ని లెక్కించడం ఆనవాయితీ. అందులో భాగంగా గత నెల 31న చిత్ర పౌర్ణమి ప్రారంభమై నెల ఒకటివ తేదీ ముగిసింది. దీంతో హుండీ ఆదాయాన్ని ఆలయ జెసి భరణీధరన్ అధ్యక్షతన మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 9 గంటల వరకు లెక్కించారు. వీటిలో రూ: 4 కోట్ల 33 లక్షల 72,935 నగదు, 165 గ్రాముల బంగారం, 1,240 గ్రాముల వెండి, ఇతర దేశాలకు చెందిన కరెన్సీ నోట్లుతో పాటు ఆదాయం వచ్చినట్లు ఆలయ జేసీ తెలిపారు. ఈ ఆదాయాన్ని ప్రభుత్వ ఖాతాలో జమచేసిన నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆలయంలో హుండీ లెక్కింపు సమయంలో ప్రత్యేక నిఘా కెమెరాలు ఉంచి లెక్కింపు చేశారు. అదే విధంగా గత నెల చిత్ర పౌర్ణమి కావడంతో భక్తులు అధికసంఖ్యలో ఆలయ సమీపంలోని 14 కిలోమీటరు దూరంలో గల గిరివలయం రోడ్డును తిరిగి వచ్చారు. దీంతో ఆలయ అధికారులచే గిరివలయం రోడ్డు, ఆలయ ప్రాంగణం తదితర ప్రాంతాల్లో అదనపు హుండీలను ఏర్పాటు చేయడంతో ఆదాయం పెరిగిందని ఆలయ అధికారులు తెలిపారు.
ఇంటెలిజెన్స్ ఐజీగా అష్రాకార్గ్ నియామకం
సాక్షి. చైన్నె:తమిళనా డు పోలీస్ శాఖలో కీలకమైన ఇంటెలిజెనన్స్ ఐజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అష్రా గా ర్గ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఉత్తర మండల ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనను, ఈ కీల క పదవికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయంలో ఐజీగా ఉన్న సెంథిల్ వేలన్‌ను ఎన్నికల కమిషన్ బదిలీ చేసి, ఆయన స్థానంలో అవినాష్ కుమార్‌ను నియమించింది. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో, ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్త సారథిగా అష్రాకార్గ్ బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ పాల్గొన్న కరూర్ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన దురదృష్టకర సంఘటన అందరికీ తెలిసిందే. ఆ కేసు విచారణాధికారిగా అప్పట్లో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభు త్వం అష్రాకార్గ్‌ను నియమించింది. ఇప్పుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వమే ఆయనను అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ ఐజీగా నియమించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
జూన్ 19, 21 తేదీల్లో చైన్నె – తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు
కొరుక్కుపేట: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు సదరన్ రైల్వే ఓ ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. అరక్కోణంలో ట్రాక్ పనులు జరుగుతున్న దష్ట్యా చైన్నె – తిరుపతి మధ్య నడిచే అన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లను జూన్ 19 , 21 తేదీలలో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ఈ చర్యకు కారణం, స్టేషన్ వర్క్‌షాప్‌లో ట్రాక్‌లపై చేపట్టనున్న సాంకేతిక నిర్వహణ పనులే కారణమని స్పష్టం చేసింది. ఈ పనులు అరక్కోణంలో ఈనెల 26వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు నిరంతరాయంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా, జూన్ 19, 21 తేదీల్లో తిరుపతి– చైన్నె మధ్య నడిచే ప్రధాన రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.


