అలాంటి అవసరం లేదు | - | Sakshi
Sakshi News home page

అలాంటి అవసరం లేదు

Jul 12 2026 1:53 AM | Updated on Jul 12 2026 1:53 AM

అలాంటి అవసరం లేదు

తమిళసినిమా: సినీ కథానాయకల్లో ఒక్కొక్కరికీ ఒక్కో బాణి ఉంటుంది. కొందరు అందచందాలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. కొందరు తమ నటనా ప్రతిభనే నమ్ముకుంటారు. ఇంకొకరు అన్ని రకాల పాత్రలను పోషించాలని కోరుకుంటారు. వీటిలో రెండవ కేటగిరీకి చెందిన నటి సాయి పల్లవి. వైద్య వృత్తి చదివినా నటనపై ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశించిన సాయి పల్లవి ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రంతో తానేమిటో నిరూపించుకున్నారు. తర్వా తెలుగు, తమిళ భాషల్లో కూడా నటిస్తూ స్టార్‌ అంతస్తుకు చేరుకున్నారు. ఈమధ్య ఈమె శివకార్తికేయన్‌కు జంటగా నటించిన అమరన్‌ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. ముఖ్యంగా సాయి పల్లవి నటన సర్వత్ర ప్రశంసలు అందుకుంది. కాగా ఇటీవల బాలీవుడ్‌ లో కూడా ఎంట్రీ ఇచ్చారు. అక్కడ అమీర్‌ ఖాన్‌ వారసుడు జునైత్‌ ఖాన్‌గా ఏక్‌ దిన్‌ అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం భారతీయ ఇతిహాసం అయినా రామాయణం నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందుతున్న రామాయణ అని పాన్‌ ఇండియా చిత్రంలో సీతగా నటిస్తున్నారు. అదేవిధంగా తమిళంలో ధనుష్‌ కు జంటగా ఓమ్‌ అనే భారీ బడ్జెట్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మరో నాయిక శ్రీలీల నటిస్తున్నారు. ఇదిలా ఉండగా సాయి పల్లవి నటిగా ఆది నుంచి ఒక ప్రిన్సిపల్స్‌ పాటిస్తూ వస్తున్నారు. మేకప్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడం, నటనలో సహజత్వానికి ప్రాముఖ్యతను ఇవ్వడం, గ్లామర్‌ కు దూరంగా ఉండటం, కథా పాత్రలు నచ్చితేనే నటించడానికి సమ్మతించడం వంటివి ఈమె కచ్చితంగా పాటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయి పల్లవి ఇటీవల ఒక భేటిలో పేర్కొంటూ శ్ఙ్రీ ప్రారంభ కాలం నుంచే నేను చిత్రాల్లో ముద్దు సన్నివేశాలకు వ్యతిరేకిని. అలాంటి సన్నివేశాలు నటించడానికి నా మనసు అంగీకరించదు. ఈ ప్రపంచంలో ప్రతి యువతి యువకుడు సంతోషంగా జీవించడానికి ఓ ఇల్లు, మంచి కారు ఉండాలని కోరుకుంటారు. దేవుని దయవల్ల నాకు అలాంటి ఆడంబర జీవితం, సంతోషం లభించాయి. అదేవిధంగా ఆడంబరాల కోసం మాత్రమే నేను ఎప్పుడూ సినిమాల్లో నటించ లేదు. మరో కొత్త కారు కొనుక్కోవడానికో, డబ్బు కోసం నటులతో ముద్దు సన్నివేశాల్లో నటించాల్సిన అవసరం నాకు లేదు. అదే విధంగా హద్దులు మీరిన ప్రేమ సన్నివేశాల్లో నటించాలంటే వేరెవరినైనా వెతుక్కోండి.. నా వద్దకు రాకండి. మంచి నటన కోసం మాత్రమే నా వద్దకు రండి శ్ఙ్రీ అని నటి సాయి పల్లవి పేర్కొన్నారు.

సూపర్‌ హీరో

చిత్ర సెకండ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement