దివ్యాంగులకు విద్య, వైద్యంపై సర్వే | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు విద్య, వైద్యంపై సర్వే

Jul 12 2026 1:53 AM | Updated on Jul 12 2026 1:53 AM

వేలూరు: వేలూరు జిల్లాలోని దివ్యాంగుల సర్వేను ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ లీల అలెక్స్‌ అన్నారు. వేలూరు కలెక్టరేట్‌లో దివ్యాంగులకు సంక్షేమ పథకాలు పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వేలూరు జిల్లాలో 34,716 మంది దివ్యాంగులు ఉన్నట్లు గత సర్వేలు చెపుతున్నాయని మరోసారి సర్వే పనులు చేపట్టేందుకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 120 మందిని నియమించినట్లు తెలిపారు. వీరు ఇంటింటికీ వెళ్లి సర్వే పనులు చేపట్టి దివ్యాంగులు ఉంటే అక్కడిక్కడే ట్యాబ్‌ ద్వారా వారి పేర్లును నమోదు చేస్తారన్నారు. అదేవిధంగా వారికి ఎటువంటి సౌకర్యాలు అవసరం, విద్య, వైద్యం, లేక పనిముట్లు, తదితర వసతులౖ వివరాలను నేరుగా వెల్లి సేకరించనున్నట్లు తెలిపారు. ఇందుకు వికలాంగుల కుటుంబ సభ్యులు పూర్తిగా సహకారం అందజేయాలన్నారు. ఈ సర్వే పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే దివ్యాంగుల సంక్షేమ శాఖ అద్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల కుటుంబ సభ్యులకు అవగాహణ కల్పించడం జరిగిందన్నారు. వీటితో పాటు మీడియా ద్వారా కూడా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వీటిని జిల్లాలోని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అర్హులైన దివ్యాంగులకు వివిధ సంక్షేమ పథకాలతో పాటు పని ముట్లను అందజేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి బాబు, అసిస్టెంట్‌ అధికారి ఇనియన్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement