ఎన్న విలై తో జాతీయ అవార్డు పక్కా..! | - | Sakshi
Sakshi News home page

ఎన్న విలై తో జాతీయ అవార్డు పక్కా..!

Jul 12 2026 1:53 AM | Updated on Jul 12 2026 1:53 AM

తమిళసినిమా: ఎన్న విలై చిత్రం తనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును తెచ్చిపడుతుంది అనే నమ్మకాన్ని నటుడు , రాజకీయ నాయకుడు కరుణాస్‌ వ్యక్తం చేశారు. నటి నిమిషా సజయన్‌, కరుణాస్‌ ప్రధానపాత్రులను పోషించిన చిత్రం ఎన్న విలై. విజయలక్ష్మి అహత్యన్‌, చిత్త దర్శన్‌, పూర్ణిమ భాగ్యరాజ్‌, వైజీ.మహేంద్రన్‌, మొట్టై రాజేంద్రన్‌ నిళల్గళ్‌ రవి, ప్రవీణా, మోహన్‌ రామ్‌, చేతన్‌ కుమార్‌, కవితలయ్య కృష్ణన్‌, కమలేష్‌, గోలి సోడా పాండి, జే యస్‌ కవి, స్వామినాథన్‌ ,దీపాశంకర్‌, కవి నక్సలైట్స్‌ తదితరులు ముఖ్యపాత్రను పోషించిన ఈ చిత్రాన్ని కళామయ ఫిలిమ్స్‌ పతాకంపై వి. జితేష్‌ నిర్మించారు సజీవ్‌ పాళూర్‌ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని, అల్బీ ఆంటోని ఛాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు సజీవ్‌ పాళూర్‌ వివరాలు తెలుపుతూ ఇది సోషల్‌ ఇష్యూను చర్చించే కథా చిత్రం.. ఇలాంటి చిత్రం ఇండియన్‌ జ్యుడిషియల్‌ చరిత్రలో ఇంతకు ముందు రాలేదీ.. రామేశ్వరం సముద్ర తీర మత్స్యకారుల ఇతివృత్తంతో చిత్ర కథ సాగుతుంది. వస్తువుకు ధర కట్టడం కాకుండా వెలకట్టలేని వస్తువు గురించిన కథా చిత్రం ఎన్న విలై అని చెప్పారు.. కరుణాస్‌ మాట్లాడుతూ కథా రచయితగా జాతీయ అవార్డును అందుకున్న సజీవ్‌ పాళూర్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం స్వతహాగా మలయాళీ అయిన ఈయన తమిళంలోనే చిత్రం చేయాలని కోరికతో ఈ చిత్రం చేశారు. నేను ఇంతకుముందు ఎన్నో వైవిధ్య భరిత కథాపాత్రలో నటించాను. అయితే ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకం. ఇందులో మత్స్యకారుడిగా నటించాను. నటుడిగా జాతీయ అవార్డును పొందాలన్నది తన చిరకాల వాంఛ. అది ఈ చిత్రంతో నెరవేరుతుందనే నమ్మకం ఉంది అని నటుడు కరుణాస్‌ పేర్కొన్నారు. ఈ చిత్రంలో నేను న్యాయవాదిగా నటించినట్లు నటి నిమిషా సజయన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement