నేడు విజయ్‌ సర్కార్‌కు బలపరీక్ష | TVK Vijay Government Face Floor Test In Tamil Nadu Assembly Live Updates, Faces Crucial Vote Amid Legal Twist Over MLA Disqualification | Sakshi
Sakshi News home page

నేడు విజయ్‌ సర్కార్‌కు బలపరీక్ష

May 13 2026 6:47 AM | Updated on May 13 2026 10:50 AM

TVK Vijay Government Face Floor Test in Tamil Nadu Assembly Live Updates

సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. శాసనసభలో విజయ్‌ సర్కార్‌ బలపరీక్షకు సిద్ధమైంది. అయితే అధికార టీవీకేకు చెందిన ఒక ఎమ్మెల్యే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

తమిళనాడు ఎన్నికల్లో 234 స్థానాలకుగానూ విజయ్‌ పార్టీ 108 సీట్లు గెలిచింది. విజయ్‌ రెండు చోట్లా పోటీ చేయడంతో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో టీవీకే బలం 107కి పడిపోయింది. కాంగ్రెస్‌ 5, వామపక్షాలు 4, వీసీకే 2 సీట్ల మద్దతుతో మ్యాజిక్‌ ఫిగర్‌ 118ని టీవీకే చేరుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే.. 

ఒక ఓటు తేడాతో నెగ్గిన తిరుప్పత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఓటింగ్‌లో పాల్గొనడానికి వీల్లేదని మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కౌంటింగ్‌లో తేడా జరిగిందని.. శ్రీనివాస ఎన్నిక చెల్లదంటూ డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియాకరుప్పర్‌ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో.. హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ టీవీకే ఎమ్మెల్యే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరగనుంది. 

అయితే.. శ్రీనివాస్‌ దూరం అయిన నేపథ్యంలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వ బలం 117కి పడిపోయింది. అయితే ఏఎంఎంకే పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కామరాజ్‌ తన అధిష్టానాన్ని ఎదురించి మరీ విజయ్‌ పార్టీకి మద్దతు ప్రకటించారు. అలాగే అన్నాడీఎంకే పార్టీలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే. అందులోని 28 మంది ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్‌ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి విజయ్‌ (Vijay) సీవీ షణ్ముగం నివాసానికి వెళ్లి భేటీ కావడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో.. ఇవాళ్టి బలనిరూపణ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement