మొన్నే సీఎంగా ప్రమాణం.. అప్పుడే విజయ్‌ బిగ్‌ బొనాంజ ప‍్రకటన | CM Vijay Hikes DA To 60 percent | Sakshi
Sakshi News home page

మొన్నే సీఎంగా ప్రమాణం.. అప్పుడే విజయ్‌ బిగ్‌ బొనాంజ ప‍్రకటన

May 14 2026 3:42 PM | Updated on May 14 2026 3:50 PM

CM Vijay Hikes DA To 60 percent

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్ అప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బిగ్‌ బొనాంజా ప్రకటించారు. గురువారం డియర్‌నెస్ అలవెన్స్‌ (డీఏ)లో 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది. ఇది 2026, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది.

సమాచార, ప్రజాసంబంధాల శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సవరించిన డీఏ వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు లాభం చేకూరుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తమిళనాడు సీఎంవో ఎక్స్‌ ఖాతాలో వివరించారు.

డీఏ పెంపు ఇలా..
తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 2 శాతం డీఏ పెంపుతో మొత్తం డీఏ 60 శాతానికి చేరింది. దీనితో పోల్చితే బ్యాంకు ఉద్యోగులకు సుమారు 0.70 పాయింట్ల స్వల్ప పెంపు మాత్రమే లభించింది. దీంతో వారికి వచ్చే నగదు ప్రయోజనం తక్కువగా ఉంది. ద్రవ్యోల్బణానికి వేర్వేరు రంగాలు ఎలా స్పందిస్తున్నాయో ఈ తేడా చూపిస్తోంది. 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలవెన్సుల్లో ఎక్కువ సవరణ లభించింది. ఈ నిర్ణయం వల్ల ఏటా అదనంగా సుమారు రూ. 1,230 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగుల సంక్షేమం, పెన్షన్ బాధ్యతలకు అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement