సీనియర్‌ నిర్మాత, నటుడు కె.రాజన్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

సీనియర్‌ నిర్మాత, నటుడు కె.రాజన్‌ ఆత్మహత్య

May 18 2026 6:51 AM | Updated on May 18 2026 6:51 AM

తమిళసినిమా: సీనియర్‌ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు కె.రాజన్‌ (80) ఆదివారం సాయంత్రం స్థానిక ఆడయార్‌ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కె.రాజన్‌ 1983లో బ్రహ్మచారిగళ్‌ అనే చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తరువాత పలు చిత్రాలు నిర్మించిన ఈయన నటుడు నిళల్‌గళ్‌ రవి, శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలు పోషించిన నమ్మ ఊరు మారియమ్మ అనే చిత్రానికి దర్శత్వం వహించారు. దర్శకుడు సెంథిల్‌నాథన్‌ కోసం ఆయన దర్శకత్వం వహించిన తంగమాన తంగచ్చి చిత్రానికి కథను అందించారు. అదే విధంగా పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన కె.రాజన్‌ పలు సినీ సంఘాల్లో కీలక పాత్రను నిర్వహించారు. ప్రస్తుతం సినీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతను నిర్వహిస్తూ వచ్చారు. కాగా సినీ వేదికపలై ఏ విషయాన్నైనా నిర్భయంగా మాట్లాడే ఈయన ముఖ్యంగా చిన్న చిత్రాల రక్షణ కోసం గళమెత్తేవారు. అంతే కాకుండా నిర్మాతలను కాపాడే విధంగా స్టార్‌ హీరోల పారితోషికాలను తగ్గించుకోవాలని గొంతేత్తడంలో ఎప్పుడూ ముందుండేవారు. అంతే కాకుండా కె.రాజన్‌ విద్యాదాత కూడా. చిన్న పిల్లల కోసం పాఠశాలను నిర్విస్తూ వచ్చారు. ఎందరికో ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. అలాంటి కె.రాజన్‌ ఇలా నదిలో పడి ఆత్యహత్య చేసుకోవడం చిత్ర పరిశ్రమను ధిగ్బ్రాంతికి గురి చేసింది. ఈయన భౌతిక కాయాన్ని అగ్నిమాపక దళం అడయారు నదిలో నుంచి పైకి తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా కె.రాజన్‌ ఆత్మహత్య హత్యకు కారణాలు గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈయన స్థానికి ఓల్డ్‌ వాషర్‌పేటలోని కప్పల్‌ పొలు వీధిలో నివశిస్తూ వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement