ధర్మరాజు ఆలయంలో జాతర ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ధర్మరాజు ఆలయంలో జాతర ఉత్సవాలు

May 15 2026 10:14 AM | Updated on May 15 2026 10:14 AM

తిరువళ్లూరు: మేట్టుపాళ్యంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ద్రౌపతి అమ్మవారు సమేత ధర్మరాజు ఆలయంలో చైత్రమాసం జాతర ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు గురువారం ఉదయం స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా మేట్టుపాళ్యంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ద్రౌపతి అమ్మవారు సమేత ధర్మరాజుల ఆలయం ఉంది. ఇక్కడ ఏటా చైత్రమాసంలో పది రోజుల పాటూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే గత ఏడు రోజుల క్రితం ధ్వజారోహణంతో ఉత్సవాలను ప్రారంభించారు. ఏడవ రోజైన గురువారం ఉదయం స్వామి వారిని గ్రామంలో ఊరేగించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్ద స్వామి వారికి మంచంపై నైవేద్యంగా పండ్లు, స్వీట్లు తదితర వాటిని పెట్టి మొక్కుబడి చెల్లించుకున్నారు. కాగా ఉత్సవాల సందర్భంగా గ్రామంలో సందడి నెలకొంది. ఉత్సవాలకు పట్టణాల్లో వున్న వారు సైతం గ్రామంలోకి రావడంతో కలకలాడింది. ఇది ఇలా ఉండగా ఆదివారం అమ్మవారి ఆలయం వద్ద అగ్నిగుండ ప్రవేశం తదితర ఉత్సవాలు జరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement