ఘనంగా శివాలయాల్లో ప్రదోష పూజలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా శివాలయాల్లో ప్రదోష పూజలు

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

ఘనంగా శివాలయాల్లో ప్రదోష పూజలు

వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోని ఆలయాల్లో తమిళ చిత్ర మాస ప్రదోష దినోత్సవం పురస్కరించుకొని ప్రదోష పూజలను నిర్వహించారు. ముందుగా తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం భక్తుల అధిక సంఖ్యలో చేరుకొని హరోంహర నామ స్మరణల మధ్య శివాచార్యులు వేద మంత్రాల నడుమ కర్పూర హారతులు పట్టారు. అనంతరం స్వామివారిని నంది వాహనంలో ఆశీనులు చేసి మాడ వీధుల్లో ఊరేగించారు. అదేవిధంగా వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో నంది భగవాన్‌కు శివాచార్యులు ప్రత్యేక పూజలు చేసి కాయగూరలతో అలంకరించారు. అనంతరం నంది భగవాన్‌కు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement