కంటెంట్ క్రియేటర్ల కోసం సరికొత్త ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: ప్రముఖ డిజిటల్ ఇమేజింగ్ సంస్థ కానన్ ఇండియా నేతృత్వంలో సరికొత్త తరం ఫిల్మ్ మేకర్లు, కంటెంట్ క్రియేటర్ల కోసం అత్యాధునిక వీడియో–ఫోకస్డ్ కెమెరాగా ఈఎస్‌ఓఆర్6వీ ఆవిష్కరించారు. అలాగే మొట్టమొదటి ఎల్–సిరీస్ పవర్ జూమ్ లెన్స్‌ఆర్‌ఎఫ్ 20–50 ఎఫ్4ఎల్‌ను కూడా పరిచయం చేవారు. వేగంగా విస్తరిస్తున్న క్రియేటర్ ఎకానమీని దృష్టిలో ఉంచుకుని సరికొత్త కొత్త ఉద్యమంలో భాగంగా ఈ ఉత్పత్తులను లాంచ్ గురువారం స్థానికంగా ఆవిష్కరించారు. ఓ ఓపెన్ గేట్ రికార్డింగ్ ఫీచర్ ద్వారా వీడియోను హారిజాంటల్ నుండి వర్టికల్ ఫార్మాట్‌కు మార్చుకోవడానికి ఇందులో ప్రత్యేక ఆఫ్షన్లు కల్పించారు. ఇది సోషల్ మీడియా క్రియేటర్లకు ఎంతో ఉపయోగకరం, సుదీర్ఘ సమయం పాటు అంతరాయం లేకుండా వీడియో రికార్డింగ్ చేయడానికి వీలుగా ఇందులో బిల్ట్–ఇన్ కూలింగ్ ఫ్యాన్‌ను అమర్చారు. 32.5 మెగాపిక్సెల్ ఫుల్–ఫ్రేవ్ సీఎంఓఎస్ సెన్సార్‌తో అద్భుతమైన ఫొటోలు వీడియోలను తీయడానకిఇ అవకాశం కల్పించారు. వెడ్డింగ్ ఫిల్మ్ మేకింగ్, రీజినల్ సినిమా , డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల కోసం ఈ కెమెరా ఒక ’గేమ్ ఛేంజర్’ అవుతుందని కానన్ ఎండీ టైగర్ ఇషీ, కానన్ ఇండియా ఈసీఈఓ తోషియాకి నోమురాలు వివరించారు.
ఫిట్స్ రావడంతో బావిలో పడ్డ కార్మికుడి మృతి
తిరువళ్లూరు: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు ఫిట్స్ రావడంతో బావిలో పడి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వెంగల్ సమీపంలోని కారణి గ్రామానికి చెందిన సూర్య(24). ఇతను అత్తిపేడులోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా ఇతడికి పదేపదే పిట్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం మద్యాహ్నం స్నేహితులతో కలిసి సరదాగా ఈత కోసం బావి వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది. దాదాపు పది మంది స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లారు. అనంతరం అందరూ బావిలో నుంచి పైకి రాగా సూర్య మాత్రం మరి కొంతసేపు ఈత కొట్టి వస్తానని చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సమయంలోనే సూర్యకు పిట్స్ వచ్చి భావిలో ముగినిపోయాడు. సమయం దాటుతున్నా బయటకు రాకపోవడంతో స్నేహితులు బావిలో గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది బావిలో గాలించి సూర్య మృతదేహాన్ని బయటకు తీసి శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడు బావిలో మునిగి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు.
విశ్రాంత ఉద్యోగి ఖాతా నుంచి రూ.14.65 లక్షలు మాయం
ముగ్గురు తెలంగాణకు చెందిన ముగ్గురి అరెస్టు
తిరువళ్లూరు: విశ్రాంతి పొందిన ఉద్యోగి ఖాతా నుంచి రూ. 14.65 లక్షల కాజేసిన ముగ్గురు తెలంగాణకు చెందిన యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి ప్రాంతానికి చెందిన నటరాజన్(67). ఇతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి విశ్రాంతి పొందాడు. ఈ క్రమంలో ఇతడి ఖాతా నుంచి గత కొద్ది రోజుల క్రితం రూ. 14.65 లక్షలు మాయమైనట్టు గుర్తించి షాక్‌కు గురయ్యాడు. ఈ సంఘటనపై భాదితుడు ఆవడి పోలీసు కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. పోలీసుల విచారణలో విశ్రాంత ఉద్యోగి ఖాతా నుంచి రూ. 14.65 లక్షలు తెలంగాణాకు చెందిన జంగం నవీన్‌కుమార్, కోటా భానుప్రకాష్, గట్టం రాఘవేంద్ర తదితర ముగ్గురు కలిసి ఆన్‌లైన్ ద్వారా కాజేసినట్టు గుర్తించి వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
తిరువొత్తియూరు: మహిళ వద్ద రూ.300 లంచం తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ సస్పెండయ్యాడు. రాణిపేట జిల్లా ఆర్కాట్ టౌన్ పోలీస్‌స్టేషన్‌న్‌లో హెడ్ కానిస్టేబుల్ కల్పన. ఈమె వాలాజా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రమాదాలు, వివిధ సమస్యలకు సంబంధించి నమోదయ్యే కేసుల సమాచారాన్ని పోలీసు విభాగానికి అందించే విధుల్లో వున్నారు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం, ఒక గొడవలో గాయపడిన మహిళ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమాచారాన్ని పోలీస్‌స్టేషన్‌న్‌కు తెలియజేయడానికి, కల్పన తన బంధువుకు చెందిన గూగుల్ పే నంబర్‌కు రూ.300 పంపాలని లంచం డిమాండ్ చేశారు. మహిళ నగదుపంపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై విచారణ జరిపిన ఎస్పీ సిబిన్, హెడ్ కానిస్టేబుల్ కల్పనను బుధవారం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.


