– ఆంధ్ర కళా స్రవంతిలో ప్రత్యేక పూజలు
కొరుక్కుపేట: ఆధ్యాత్మిక,సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్న శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. దీనికి చైన్నె కొరట్టూరు అగ్రహారంలో శ్రీ కోదండ రామాలయంలోని హాలు వేదికై ంది. శ్రీ ఆంధ్ర కళాస్రవంతి అధ్యక్షులు జె.ఎం.నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముందుగా 108 రకాల పండ్లుతో శ్రీ ఆంజనేయ స్వామిని నేత్రపర్వంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు .అనంతరం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ది హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, శ్రీ రామాంజనేయ నామ సంకీర్తన మండలి (చైన్నె) సంయుక్తంగా 14 మంది భక్తుల బృందం చే 108 సార్లు హనుమాన్ చాలీసాను సంగీత పఠనం చేసి భక్తులను మంత్రముగ్దులను చేశారు. ఆంధ్ర కళాస్రవంతి ప్రధాన కార్యదర్శి జే.శ్రీనివాస్ ,ఉపాధ్యక్షులు విఎన్ హరినాథ్,పి.సరస్వతి, జాయింట్ సెక్రటరీ చింతా సాంబశివరావు , ఇంకా అన్నపూర్ణ, బాలాజీ ,ఎం. కాశీ విశ్వనాథం పాల్గొన్నారు.


