పురుషుల రక్షణ కోసం హెల్ప్‌లైన్‌ కావాలి | - | Sakshi
Sakshi News home page

పురుషుల రక్షణ కోసం హెల్ప్‌లైన్‌ కావాలి

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

● సాంకేతిక విభాగం డీఐజీ జయలక్ష్మి ఆదేశాలు ● ముగ్గురు యువకుల మృతి ● నలుగురికి తీవ్ర గాయాలు పిచ్చికుక్క దాడిలో 18 మందికి గాయాలు

తమిళసినిమా: ఇటీవల నటుడు రవిమోహన్‌ తన భార్య కుటుంబం వేధిపుల గురించి మీడియా ముందు వెల్లడిస్తూ కంటతడి పెట్టిన విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత నాలుగేళ్లుగా తన భార్య, ఆమె కుటంబం తనను తీవ్ర మనస్థాపానికి గురి చేస్తోందని, తన పిల్లలను కూడా చూడనీయకుండా చేస్తున్నారని, తాను పలుమార్లు చేతి నరాలు కట్‌ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డానని ఆవేదన చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో పురుష రక్షణ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది అరుల్‌ తుమిళన్‌ ముఖ్యమంత్రి విజయ్‌కు ఒక విజ్ఞాపన లేఖను రాశారు. అందులో తమిళనాడులో భార్యా బాధితుల మరణాలు అధికం అవుతున్నాయని, వారిని రక్షించడానికి పురుష రక్షణ కోసం ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన దేశాలైన బ్రిటన్‌, ఆస్ట్రేలియాలో పురుష రక్షణ కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారని,అదే విధంగా తమిళనాడులోనూ ఆ దిశగా చర్యలు చేపట్టాలాని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా 162 మంది టెక్నికల్‌ ఎస్‌ఐల బదిలీ

కొరుక్కుపేట: పోలీస్‌ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 162 మంది టెక్నికల్‌ ఎస్‌ఐలను డీఐజీ (టెక్నికల్‌ డివిజన్‌) జయలక్ష్మి బదిలీ చేశారు. తమిళనాడు పోలీసులోని వివిధ సాంకేతిక విభాగాలలో ఎస్‌ఐలు పనిచేస్తున్నారు. వారు 3 సంవత్సరాలకు పైగా ఒకే చోట పనిచేస్తున్నందున, పరిపాలనా సౌలభ్యం కోసం, ఇతర విభాగాలకు బదిలీ కావాలని ఎస్‌ఐలు చేసిన అభ్యర్థనల మేరకు, 162 మంది ఎస్‌ఐలను పోలీసులోని వివిధ విభాగాలకు బదిలీ చేయాలని ఉత్తర్వులిచ్చారు. ఇందులో సి.బి.సి.ఐ.డి సాంకేతిక విభాగంలో పనిచేసిన ఎస్‌ఐ బాల ఆత్మనేసర్‌ను చైన్నెలోని ఉగ్రవాద నిరోధక దళానికి బదిలీ చేశారు. తమిళనాడు ఆన్‌లైన్‌ గేమింగ్‌ కమిషన్‌లో పనిచేసిన ఇర్ఫాన్‌ అయాజ్‌ను చైన్నెలోని ఉగ్రవాద నిరోధక దళానికి, ఆర్థిక నేరాల విభాగంలో పనిచేసిన రాబర్ట్‌ బ్రూస్‌ను చైన్నెలోని ఉగ్రవాద నిరోధక దళానికి బదిలీ చేశారు. వీరపురంలోని తమిళనాడు 3వ బెటాలియన్‌లో పనిచేసిన కలైసెల్విని ఉగ్రవాద నిరోధక దళానికి, ఆవడి మెట్రోపాలిటన్‌ పోలీస్‌ను చైన్నెలోని ఉత్తర మెట్రోపాలిటన్‌ పోలీస్‌ జోన్‌, పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

బైకు – బస్సు ఢీ

అన్నానగర్‌: విల్లుపురం జిల్లా, మరకానం మండవాయి,పుదుక్కుప్పం సమీపంలోని ఆలపాక్కంకి చెందిన శేషాద్రి కుమారుడు సిలంబరసన్‌ (29). ఇతనికి పెళ్లి కాలేదు. ఆదివారం తెల్లవారుజామున సిలంబరసన్‌ను అతని బావ స్టాలిన్‌ (37), కలపట్టులోని కనకశెట్టి కుళం ప్రాంతంలో హోటల్‌ నడుపుతున్న మరో బావ కార్తికేయన్‌ (33) ఒకే బైకుపై పుదుచ్చేరిలోని అభిషేకప్పక్కం ప్రాంతానికి వెళ్లారు. స్టాలిన్‌ బైక్‌ నడుపుతున్నాడు. పుదుచ్చేరిలోని ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డులో కొట్టకుప్పం సమీపంలో ఉన్న పెరియముదలియార్‌ చావడి ఎకై ్సజ్‌ చెక్‌ పోస్ట్‌ వద్దకు వారు సమీపిస్తుండగా, అతివేగంగా వస్తున్న తమిళనాడు ప్రభుత్వ బస్సు, చైన్నె నుండి పుదుచ్చేరి వైపు వస్తున్న కారును ఢీకొట్టింది. ఇదే క్రమంలో ఆ బస్సు స్టాలిన్‌ ప్రయాణిస్తున్న బైకును కూడా ఢీకొట్టింది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న స్టాలిన్‌తో సహా ముగ్గురు బస్సు ముందు చక్రలో చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు. దిండుక్కల్‌ వెస్ట్‌ గక్కన్‌ రోడ్‌కు చెందిన బస్సు డ్రైవర్‌ మురుగేశ్వరన్‌ (30), అక్కడ బస్సును ఆపి పారిపోయాడు. అనంతరం, బస్సు డ్రైవర్‌ మురుగేశ్వరన్‌ పుదుచ్చేరిలోని ఉరులయన్‌పేట పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష కోసం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి పంపారు. బస్సు ఢీకొన్న కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఐటీ ఉద్యోగులు శివాసిస్‌ పట్టి నాయక్‌ (35), నరేంద్ర (25), యశ్వంత్‌ భూపతి (30), తరుణ్‌ (25)కు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా పుదుచ్చేరిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోటకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తిరువళ్లూరు: పిచ్చికుక్క దాడిలో ఒకే రోజు ముగ్గురు మహిళలు సహా 18 మంది తీవ్రంగా గాయపడిన ఘటన తిరువళ్లూరులో కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా కాకలూరు లోని నివాస ప్రాంతాల్లో పిచ్చికుక్క సంచరిస్తూ కనిపించింది. అదేసమయంలో అటువైపు వెళు తున్న ముగ్గురు మహిళలు సహా 18 మందిపై దాడి చేసి గాయపరిచింది. కుక్క దాడిలో కాకలూరుకు చెందిన గజేంద్రన్‌ (65), సురేష్‌ (42), రవికుమార్‌ (26), భాస్కర్‌ (29), గోకనాథన్‌ (60), మాల (22) సహా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని తిరువ ళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement