తిరుత్తణి: విద్యుత్ గ్రీవెన్స్‌లో అధికారులపై రైతులు ఫిర్యాదు చేశారు. తిరుత్తణి విద్యుత్‌శాఖ డివిజనల్ కార్యాలయంలో డివిజినల్ ఇంజినీర్ మురుగభూపతి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఇందులో తిరువళ్లూరు సూపిరింటెండెంట్ ఇంజినీర్ శేఖర్ పాల్గొన్నారు. గ్రీవెన్స్‌లో రైతులు, విద్యుత్ వినియోగదారులు పాల్గొని విద్యుత్ సేవలకు సంబంధించి ఫిర్యాదులు అందజేశారు. ఆర్కేపేట సమీపం ఆదివరాహపురానికి చెందిన మహిళా రైతు ఫిర్యాదు చేశారు. తనకు ఒకటిన్నర ఎకరా పొలానికి విద్యుత్ లైన్ కోసం తత్కాల్ పథకం కింద ఆరు నెలల కిందట రూ. 2.50 లక్షలు చెల్లించాను. అయితే ఇంతవరకు తనకు విద్యుత్ కనక్షన్ ఇవ్వలేదు. విద్యుత్ శాఖ అధికారులను పలుసార్లు కలుసుకుని పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అలాగే ఇటీవల గాలివాన బీభత్సానికి విద్యుత్ స్తంభాలు కూలితే విద్యుత్ శాఖ సిబ్బంది రైతుల నుంచి డబ్బులు వసూలు చేసి స్తంభాలు ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఆయిల్ నింపేందుకు రైతుల నుంచి రూ.500 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులతో విద్యుత్ గ్రీవెన్స్‌లో కలకలం రేపింది.


