సాక్షి, చైన్నె: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్‌రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని శుక్రవారం చైన్నెలో వైఎస్సార్ సేవాదళ్ తమిళనాడు విభాగం నేతృత్వంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ అనిల్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్వయంగా ఈసీఆర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి ఆయనతో కేక్ కట్ చేయించి ఆనందాన్ని సేవాదళ్ వర్గాలు పంచుకున్నాయి. సేవాదళ్ తమిళనాడు అధ్యక్షుడు ఏకే.జహీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి సేవాదళ్ వర్గాలు పెరంబూరు డాన్‌బాస్కో వృద్ధుల ఆశ్రమానికి వెళ్లారు. అనిల్ రెడ్డి ఆరోగ్య క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వృద్దులకు మధ్యాహ్నం అన్నదానం చేశారు. సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సూర్యారెడ్డి, పార్టీ నేత శరత్‌కుమార్‌రెడ్డి, సేవాదళ్ అధికార ప్రతినిధులు కీర్తి, సాయిసింహారెడ్డి, జాయింట్ సెక్రటరీలు భానుప్రకాశ్, రెడ్డిశేఖర్, నవీన్ నరేంద్ర, సంపత్, ప్రకాష్, మణివణ్ణన్, జీవన్, కొండయ్య, జితేంద్ర, మహిళ నాయకులు నాగమణి , లక్ష్మీ, రాణి పాల్గొన్నారు.


