70 సవర్ల బంగారం, 10 కిలోల వెండి చోరీ | - | Sakshi
Sakshi News home page

70 సవర్ల బంగారం, 10 కిలోల వెండి చోరీ

May 15 2026 10:14 AM | Updated on May 15 2026 10:14 AM

● మహిళా పార్లమెంటరీ ప్రతినిధి బృందం

న్యూస్‌రీల్‌

తిరువొత్తియూరు: నాగర్‌కోయిల్‌ సమీపం ఎన్‌.జి.ఓ. కాలనీ పెరుంగుళం ప్రాంతానికి చెందిన అన్బయ్య అదే ప్రాంతంలోని కామరాజర్‌ రోడ్డులో జ్యువెలరీ షాపు నడుపుతున్నారు. బుధవారం అర్ధరాత్రి సుమారు 1.30 గంటల సమయంలో, మోటార్‌ సైకిళ్లపై వచ్చిన నలుగురుగుర్తుతెలియని వ్యక్తులు అన్బయ్య నగదు దుకాణం వద్దకు చేరుకుని దుకాణం షట్టర్‌కు ఉన్న ఇనుప కడ్డీలను పగలగొట్టారు. ఆ శబ్దం విని ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వచ్చి చూడగా, గుర్తుతెలియని వ్యక్తులు దుకాణాన్ని పగలగొట్టడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన వెంటనే పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు , సుచీంద్రం పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతలోనే దుండగులు లోపలికి ప్రవేశించి, అద్దాల పెట్టెలను పగలగొట్టి అందులో ఉన్న బంగారు నగలు, వెండి వస్తువులను చోరీ మోటార్‌ సైకిళ్లపై పరారయ్యారు. సమాచారం అందుకున్న అన్బయ్య వెంటనే దుకాణం వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో సుచీంద్రం పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. దుకాణ యజమాని, పోలీసులు లోపలికి వెళ్లి పరిశీలించగా, దుకాణంలో రూ.కోటి విలువైన 70 సవర్ల బంగారు నగలు, 10 కిలోల వెండి వస్తువులు నగలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై సుచీంద్రం పోలీసులు కేసు నమోదు చేసి, పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

భారత్‌ – శ్రీలంక ద్వైపాక్షిక

సంబంధాల బలోపేతానికి పిలుపు

సాక్షి, చైన్నె: మహిళా నాయకత్వం, వ్యవస్థాపకత, ఆర్థిక భాగస్వామ్య రంగాలలో భారత్‌, శ్రీలంక దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇరు దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు. మహిళల అత్యున్నత సంస్థ అయిన ’ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌’, శ్రీలంక మహిళా ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సరోజ సావిత్రి పౌల్‌రాజ్‌ నేతృత్వంలోని శ్రీలంక మహిళా పార్లమెంటరీ ప్రతినిధి బృందం చైన్నెకు వచ్చారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య, సాంస్కృతిక బంధాల బలోపేతంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ ఇంటరాక్టివ్‌ సెషన్‌లో మహిళల నాయకత్వం, సమగ్ర అభివృద్ధి, నిర్ణయాత్మక ప్రక్రియల్లో మహిళల భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఫిక్కీ మహిళా విభాగం అధ్యక్షురాలు పూజా గార్గ్‌, శ్రీలంక మంత్రి సరోజ సావిత్రి పౌల్‌రాజ్‌, ఫిక్కీ మహిళా విభాగం కార్యదర్శిఅనంత్‌ స్వరూప్‌, ఫిక్కీ మాజీ అధ్యక్షురాలు పూనమ్‌ శర్మ, ఫిక్కీ ఫ్లో వైస్‌ ప్రెసిడెంట్‌ పూజా చౌదరి, గవర్నింగ్‌ బాడీ సభ్యులు , పలువురు ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే రాజకీయాల్లో పెను మార్పులు సంభవించనున్నాయి. ఆశించిన స్థాయిలో మెజారిటీ రాకపోవడం, అధికారాన్ని కోల్పోవడంతో పార్టీ క్యాడర్‌లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించేందుకు డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌ రంగంలోకి దిగారు. గురువారం చైన్నెలోని అన్నా అరివాలయంలో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఆయన భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement